పర్యావరణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి: గురాన అయ్యలు

  • మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమం
  • విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీరాజ్ నిర్వహణ
  • ముఖ్యఅతిధిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు

విజయనగరం: మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం డెంకాడ మండలం, పెదతాడివాడ గ్రామ పంచాయతీలో జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవ యువత ముఖ్య ప్రతినిధి, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ సంఘసేవకులు, మెగా ఫ్యామిలీకి మెగా వీరాభిమాని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాఫ్యామిలీ అభిమానులకు ఆరాధ్యదైవం పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురష్కరించుకుని మొక్కలు నాటడం ఎంతో అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతీ మెగా ఫ్యామిలీ అభిమాని వారివారి పుట్టినరోజు నాడు ఒక్క మొక్కైనా నాటాలని, బహుమతులుగా మొక్కలు ఇవ్వడం చేయాలని అన్నారు. అనంతరం జనసేన నాయకురాలు తుమ్మి లక్ష్మీరాజ్ మాట్లాడుతూ మా ఆరాధ్యదైవాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని వారి పుట్టినరోజులను హంగులు ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తుంటామని, ఈరోజు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, యువనాయకులు మదేటి బుజ్జి, జానకిరామ్, బీ.లింగం, లక్ష్మణ్, పొన్నగంటి గణేష్, బాబు, పొంతపల్లి నవీన్ పాల్గొన్నారు.