నెల్లూరులో జనంకోసం జనసేన

నెల్లూరు నగరంలోని 5 వ డివిజన్ సత్యనారాయణపురంతో పాటు పలు ప్రాంతాల్లో జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్, నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తదితరులు జనంకోసం జనసేన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన లక్ష్యాలను వారికి వివరించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలపై జనసేన తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన ఇన్చార్జి రేవంత్ తదితరులు పాల్గొన్నారు.