అనంతపురం నియోజకవర్గంలో ఇంటింటా జనసేన

  • కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

అనంతపురం నియోజకవర్గం: జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం, రాజీవ్ కాలనీ పంచాయితీ నందు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీ పంచాయతీ స్థానిక నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారి అందరికీ లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి సమక్షంలో కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలికారు. త్వరలోనే అనంతపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు ఇంఛార్జి సాకే పవన్ కుమార్, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి సంజీవ రాయుడు, చంద్ర, జక్కరెడ్డి ఆది నారాయణ, ఇండ్ల కిరణ్, జయమ్మ, ఇమామ్ హుస్సేన్, మేదర్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు రోళ్ళ భాస్కర్, కమటం వెంకటనారాయణ, ఆకుల ప్రసాద్, విశ్వనాథ్, సంపత్, పాలగిరి చరణ్ తేజ, వియకుమార్, భవాని నగర్ మంజునాథ్, భవాని నగర్ సాయినాథ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.