కొత్త జంటకు క్రీయాశీలక సభ్యత్వ కిట్లను అందించిన జానీ

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం, బొడ్లపాడు గ్రామంలో జడ్డు దిలీప్, రేవతి పెళ్ళి మహోత్సవ కార్యక్రమం సందర్బంగా క్రీయాశీలక సభ్యత్వ వాలంటీర్ జనసేన జానీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురులకు జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ కిట్లను పెళ్ళి మండపంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు జనసేన టీమ్ భరత్ సాయి, ప్రసాద్, అభి, జస్వంత్, వెంకటేష్, రామకృష్ణ, సాయి, వినయ్, సాయికిరణ్, చింతయ్య పాల్గొన్నారు. బొడ్లపాడు జనసేన టీమ్ పెళ్ళి జంటకు జనసేన సిద్ధాంతాలు తెలియజేశారు.