చిత్తూరు నగరం 31వ డివిజన్ లో జనసేన జనబాట

చిత్తూరు నగరం 31వ డివిజన్ లో జనసేన జనబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు తెలిపి, జనసేన పార్టీకి మద్దతు తెలపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎ.కె.శరవణ, జిల్లా ఐ.టి కో ఆర్డినేటర్ సల్లా గవాస్కర్, జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్, కె.పుష్ప, రమేష్, రాకేష్, వినోద్, భరత్, నాని, రాజు, నూర్, కృష్ణ, హరి, రాజేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.