అంగన్వాడిల సమ్మెకు తంబళ్ళపల్లి రమాదేవి మద్దతు

నందిగామ నియోజకవర్గం: ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా రెండవ రోజుకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, తెదేపా ఇన్ చార్జ్ తంగిరాల సౌమ్య, తెదేపా స్టేట్ అంగన్వాడి కార్యదర్శి అచంట సునీత. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అబద్దపు హమీలతో గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి సర్కారు అంగన్వాడీల సమస్యను పరిష్కరించడం లేదు, అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి 26 వేల కనీస వేతనం, గ్రాడ్యుటి అమలు చేయాలని జనసేన టిడిపి పార్టీల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు అంగన్వాడి కార్యకర్తలు నా అక్క చెల్లెలు అని, వైసిపి ప్రభుత్వం రాగానే అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలను తీరుస్తానని, వారికి జీతం పెంచుతానని, వాగ్దానాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వారి సమస్యలు పరిష్కరించకపోగా వారిపై పని భారాన్ని పెంచి, వారి కష్టాన్ని శ్రమను దోచుకుంటున్నారు. జనసేన – తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయమైన కోర్కెలను తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి శ్రేణులు భారీగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు.