మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ జనసేన ఝాన్సీ రాణులు

గుంటూరు: కృష్ణయ్య పాలెంలో సోమవారం మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక మరియు జిల్లా నాయకులు, పట్టణ కమిటీ, వీర మహిళల ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీర మహిళలు స్థానిక నాయకులు నిరసన తెలియజేయడం జరిగింది. నిరసన కార్యక్రమంలో జోగి రమేష్ చిత్రపటాన్ని వీరమహిళలు చెప్పులతో కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా వీరమహిళలు మాట్లాడుతూ జోగి రమేష్ రోగి రమేష్ అని, సంస్కారాలేని ఊర కుక్క జోగి రమేష్ అని, పిచ్చికుక్క జోగి రమేష్ అని, చిత్త కార్తె కుక్క జోగి రమేష్ అని నినాదాలు చేశారు.
అలాగే మరోసారి పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టామని, భవిష్యత్తులో జోగి రమేష్ని చెప్పుతో కొట్టవలసి ఉంటుంది అని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జోగి రమేష్ ఒక చిత్త కార్తె కుక్క అని, ఒక మంత్రి స్థానంలో ఉండి ప్రజల సొమ్ముతో పెట్టిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని తెలియజేశారు. మరోసారి పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు పేలితే చర్యల తీవ్రత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జనసైనికులు, ప్రజలు రోగి రమేష్ కి రాజకీయ సమాధి కడతారని తెలియజేశారు. అలాగే గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ మాట్లాడుతూ.. మంత్రి జోగి రమేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని తెలియజేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, గుంటూరు పట్టణ నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.