జనసేన నాయకుడు రీషికేష్ కుటుంబానికి అళహరి సుధాకర్ ఆర్ధిక సహాయం

కావలి: జనసేన కావలి అధికార ప్రతినిధి రిషికేశ్ తండ్రి డాక్టర్ మన్నేపల్లి హరిప్రసాద్ కి ఇటీవలె బ్రెయిన్ లో బ్లడ్ స్క్లాట్ అయి నెల్లూరు హాస్పటల్ లో చికిత్స చేయించి, శనివారం కావలి వారి ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న కావలి నియోజక వర్గ ఇంచార్జి అళహరి సుధాకర్ జనసేన నాయకులు, కార్యకర్తలతో వెళ్లి వారి ఆరోగ్య విషయమై విచారించి వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా రిశికేష్ మాట్లాడుతూ మా నాన్నకి ఒక్కసారిగా నడవడానికి ఇబ్బంది అనిపిస్తే వెంటనే నెల్లూరు హాస్పటల్ కు తీసుకొని వెళితే అన్ని పరీక్షలు చేసి మెదడులో రక్తం బ్లాక్ అయిందని వెంటనే 50వేల రూపాయల ఇంజక్షన్ వెయ్యాలని చెప్పగా మా ఇంచార్జి గారు సహృదయముతో స్పందించి 50వేల రూపాయలు వెంటనే పఒపడం జరిగింది, వారు చేసిన సహాయం మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది నేను మా కుటుంబ సభ్యుల తరుపున వారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాము అని, మా నాన్నకు కుడి కాలు, చెయ్ సరిగా పనిచేయని కారణంగా ఫిసియోతెరిపీ చేయిస్తే త్వరగా కోలుకుంటారు అని డాక్టర్లు చెప్పడం జరిగిందని తెలిపాడు. జనసేన నాయకులు ఆలా శ్రీనాథ్, గుడిపల్లి వెంకయ్య, బెల్లంకొండ మస్తాన్, ఐ టీ బాలు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.