జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకున్న జనసేన నాయకులు

కావలి, అళహరి సుధాకర్ సూచనల మేరకు భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జనసేన పార్టీ కావలి టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి, నాయకుల ఆధ్వర్యములో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జరుపుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గాంధీజీ తన విలువలనూ, జీవన విధానాన్నీ తన ఆత్మకథలో వివరించాడు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం, ధైర్యం కావాలనీ, అయితే ఇవి అందరిలో లేవనీ గ్రహించాడు. అందుకే అహింస అందరికి పాటించటం కష్టం అనీ, ముఖ్యంగా పిరికితనాన్ని కప్పివుచ్చడానికి వాడరాదనీ, ఒకవేళ పిరికితనం, అహింస రెండింటిలో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తాను అహింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తానన్నాడు. అంతే కాకుండా స్వాతంత్ర్యం కోసం పోరాటాల్లో పాల్గొని ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాడు. హింసా విధానాల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికి గురయ్యాడు. 1948 జనవరి 30వ తేదీన బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరపడంతో ఆయన తుది శ్వాస విడిచారు అన్నారు. అది మన జాతికే చాలా దుర్డినం అని ప్రతీ ఒక్కరూ బాపూజీ చెప్పినట్లు అహింసా, శాంతి ని పాటించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమములో పెద్దలు తోట శేషయ్య, సుధీర్, మస్తాన్, నవీన్, కృష్ణయ్య, ఆలా శ్రీనాథ్, మురళి, శ్రీను, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.