కొల్లివలస రోడ్ల దుస్థితిపై కలెక్టర్ కి పిర్యాదు చేసిన జనసేన నాయకులు

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సంత కొల్లివలస జంక్షన్లో రోడ్ల దుస్థితిపై సోమవారం జనసేన పార్టీ నాయకులు సంతోష్ నాయుడు, సంగం నాయుడు, గడే కిషోర్ మరియు అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) స్పందనకి వెళ్లి నేరుగా కలెక్టర్ కి సమస్య చెప్పడం జరిగింది. గుంతలు వలన చాలా మంది ప్రజలు పడిపోతున్నారు. దీనిపై ఆర్ అండ్ బి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని జనసేన పార్టీ ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.