యల్లటూరు భవన్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు తమ్ముడు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజంపేట కు చెందిన పలువ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి శివరామరాజుని శాలువాలు, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.