మధుసూదన్ పై దాడిని ఖండించిన జనసేన నాయకులు

చిత్తూరు జిల్లా, పలమనేరు ఎమ్మెల్యే వేంకటే గౌడకు గడప గడపలో చేదు అనుభవం ఎదురైంది. సంక్షేమ పథకాల జాబితాలో జనసేన మండల కార్యదర్శి మధుసూదన్ కు ఇంటిస్థలం మంజూరు చేసినట్లు చూపడం జరిగింది. తనకు మంజూరైన ఇంటి జాగా చూపాలని జనసేన మండల కార్యదర్శి మధుసూదన్ మరియు కుటుంబీకులు డిమాండ్ చేయడం జరిగింది. ఇష్టానుసారం ఇంటి స్థలాలను అమ్మేసుకున్నారని ఇంటి స్థలం చూపించాల్సిందే అని మధు కుటుంబం సభ్యులు పట్టుబట్టడం జరిగింది. ఎమ్మెల్యే వేంకటే గౌడ సమాధానం చెప్పలేక వెనుదిరిగడం జరిగింది. అనంతరం మధు కుటుంబ సభ్యులపై పోలీసుల సాక్షిగా వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో బైరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రి వద్దకు జనసేన కార్యకర్తలు భారీగా చేరుకోవడం జరిగింది. పరిస్థితి అందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు పెద్దాసుప్రతికి రెఫర్ చేయడం జరిగింది. పోలీసులు కేసును విచారిస్తున్నారు. జనసేన జిల్లా నాయకులు పసుపులేటి దిలీప్ పసుపులేటి, ఐటి ఇంచార్జీ సున్నపురాళ్లు భారత్ బాబు, సవరం పవన్ కుమార్ రాయల్, బాబు, శివ సంఘటనా స్థలానికి చేరుకొని దాడిని ఖండించడం జరిగింది.