విద్యార్ధులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన జనసేన నాయకులు

చీపురుపల్లి నియోజకవర్గం కొండశంభం గ్రామంలో జనసేన నాయకుడు గొర్లే చిన్నం నాయుడు ఆధ్వర్యంలో జనసేన సిద్ధాంతాలలో ఒకటైన్ పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు అవగాన కల్పిస్తూ పూజ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలి అని వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్ధులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.