జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన నాయకులు

దెందులూరు నియోజకవర్గం: పెదపాడు మండలంలో జరిగిన బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమంలో మరియు టీడీపీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం జనసేన-టీడీపి సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చింతమనేని ప్రభాకర్ పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ముత్యాల రాజేష్, జనసేన పార్టీ ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు గోదావరి జోన్ కమిటీ సభ్యులు మేడిచెర్ల కృష్ణ, పెదపాడు మండల పార్టీ నాయకులు మద్దాన వెంకటరమణ, వడ్డి భార్గవ్, మల్లేడి రాజేష్, ఆకాష్ నాయుడు, ముంగర మూర్తిరాజు దెందులూరు మండల పార్టీ నాయకులు రిత్వి బీసీ, జనసేన నాయకులు తాతపూడి చందు మరియు స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, టీడీపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.