ఘనంగా రామ్ చరణ్ 38వ జన్మదిన వేడుకలు

ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గుడికల్ నుంచి శివ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు రామ్ చరణ్ నటించిన ఆర్.ఆర్. ఆర్ సినిమాలోని పాటకి ఆస్కార్ రావడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రాబోయే రోజుల్లో ఇలాంటి విజయాలు ఎన్నో తమ అభిమాన నటుడికి వరించాలని రాబోయే రోజుల్లో రామ్ చరణ్ గారు చేపట్టబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివ చైతన్య, వీరేష్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.