ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నందు ధర్నా గురించి కోర్టుకు హాజరైన జనసేన నాయకులు

విజయవాడ, నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజయవాడ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నందు ధర్నా చేసిన సందర్భంగా ఆ కేసుపై సోమవారం విజయవాడ కోర్టుకు జనసేన నాయకులు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, స్టేట్ సెక్రటరీ విజయ్ కుమార్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్, మైలవరం నియోజకవర్గం ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), స్టేట్ జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత కోర్టుకి హాజరవటం జరిగింది.