నిజాయతీకి నిలువెత్తు రూపం దామోదరం సంజీవయ్య: రాజోలు జనసేన

భారత జాతి గర్వించదగిన రాజనీతజ్ఞుడు దామోదరం సంజీవయ్య. అతి సాధారణ.. అందులోనూ అణగారిన వర్గాలవారి కుటుంబంలో జన్మించి, అసాధారణ ప్రజానాయకునిగా ఆవిర్భవించిన సంజీవయ్య జీవితం, జీవనయానం సర్వదా ఆదర్శప్రాయం. నేడు ఆ మహానుభావుని జయంతి సందర్భంగా జనసేన తరపున, రాజోలు నియోజకవర్గం జనసేన శ్రేణులు మలికిపురం గాంధీ బొమ్మల దగ్గర నివాళులు అర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి, గుండుబోగుల పెదకాపు, రాజోలు ఎంపీటీసి దార్ల లక్షికుమారి, మలికిపురం ఎంపీటీసి జక్కంపూడి శ్రీదేవి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.