“జనంకోసం జనసేన మహాపాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం”

రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో “జనంకోసం జనసేన మహాపాదయాత్ర”లో భాగంగా “ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం” రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి హారతులు పడుతూ, పూలవర్షాలు కురిపిస్తూ, జనసైనికులు కోలాహలం నడుమ ఘనస్వాగతం పలికిన దివాన్ చెరువు గ్రామ ప్రజలు. గ్రామంలో ప్రతీ గడపకి, ప్రతీ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఆడపడుచులకు బొట్టు పెట్టి రాబోయే 2024 ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడే తత్వం, తప్పును ధైర్యంగా ప్రశ్నించే గుణం కలిగిన నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ తెలిపారు. వీరి వెంట జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.