గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాల పరిచయ కార్యక్రమం

చీరాల: పసుపులేటి సాయి మరియు చీరాల నియోజకవర్గ జనసేన యువత అధ్వర్యంలో గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో మరియు సిద్ధాంతాల పరిచయ కార్యక్రమంలో భాగంగా శనివారం రావూరిపేట కొత్తకాలవ నందు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి మొదలైన పర్యటన వినాయకపురం మీదుగా మోటుపల్లి రోడ్ మీదుగా పుల్లరివారి పాలెం పంచాయతీ పరిధిలోని రామ చంద్రపురం గ్రామంలో పర్యటించడం జరిగినది. స్థానికంగా ఉన్న జనసేన కార్యకర్త రాంబాబు సహకారంతో జెండాలతో బైక్ ర్యాలీ గా గ్రామంలో ఉన్న అన్ని వీధులలో తిరుగుతూ స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకోవడం జరిగినది. అక్కడ గమనించిన పరిస్థితులను ఆధారంగా చేసుకుని గ్రామంలో ఉన్న కాపు పెద్దలతో పసుపులేటి సాయి మాట్లాడుతూ రాబోయే రెండు వారాలలో గ్రామంలో దాదాపుగా ఉన్న 300 కుటుంబాలకు ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ మేనిఫెస్టో సిద్ధాంతలను తెలియపరిచే కార్యక్రమం స్థానిక జనసైనికుడు రాంబాబు ఆధ్వర్యంలో చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ జనసైనికులు కర్ణ, కిరణ్ తేజ్, దోగుపర్తీ లలిత్ కుమార్, గౌరబత్తిన త్రివిక్రమ్, గోగిన సుమంత్, బీరక ధనుష్, పింజల గణేష్, రామచంద్రపురం జనసైనికులు శ్రీనివాస్, రాజు, చిన్న, శివాజీ మరియు గ్రామ కాపు పెద్దలు పాల్గొన్నారు.పర్చూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించినటువంటి జనసేన పార్టీ చిన్నగంజం మండల ప్రధాన కార్యదర్శి హరి నాయుడు కి మరియు తోట అశోక్ చక్రవర్తి కి ప్రత్యేక కృతజ్ఞతలు.