జనసేన సంకల్ప పాదయాత్ర కోసం జనసేన సమావేశం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట, సెప్టెంబర్ 2వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ చేయబోయే జనసేన సంకల్ప పాదయాత్ర గురించి శుక్రవారం కొత్తపేట మండల జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అందరితో కలిసి పాదయాత్ర కార్యాచరణ పై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమవేశంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.