జనంతో జనసేన విజయవంతం కావాలి

  • జనంతో జనసేన పోస్టర్ల ఆవిష్కరణ
  • జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

తిరుపతి: జనసేన ఆధ్వర్యంలో ఆదివారం నుండీ ప్రారంభం కానున్న “జనంతో జనసేన” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను అలిపిరి శ్రీవారి చెంతన శనివారం రిలీజ్ చేసి, స్వామి వారికి కొబ్బరి కాయలుకొట్టి కార్యక్రమం విజయవంతం అవ్వాలని మొక్కలు మొక్కుకొనడం జరిగింది.. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మరియు ముఖ్య నేతలు మాట్లాడుతూ ఆదివారం 33వ వార్డు స్రావన్జర్స్ కాలనీ నుంచి జనంలోకి జనసేన అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుందని, తద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలకు కృషి చేయడమే జనసేన లక్ష్యమని, రాబోవు రోజుల్లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకొని తీరుతామని, దీనికోసం జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ కమిటీ నాయకులు రాజా రెడ్డి, బాబ్జి, సుభాషిని, వనజమ్మ, హేమ కుమార్, ముక్కు సత్యవంతుడు, కొండా రాజమోహన్, మునస్వామి, కిషోర్, హేమంత్, జీవన్ పురుషోత్తం, సాయి దేవ్, ఆదికేశవులు, బాబు, కోమల్, జయ రెడ్డి, విజయ రెడ్డి, లక్ష్మీ, దుర్గ, చందన, విశ్వ తదితరులు పాల్గొన్నారు.