తెలంగాణలో జనసేన నామినేషన్ల పర్వం

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపద్యంలో జనసేన పార్టీ తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమైంది. ఈ కార్యాచరణలో భాగంగా తెలంగాణలో జనసేన పార్టీ మొదట్లో 32 స్థానాలకు పోటీ చేయదలుచుకుని తర్వాత బిజెపితో పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లను తీసుకోవడం జరిగింది. ఎన్నికల తేదీ నవంబర్ 30 ఉండడంతో నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3న మొదలై 10 తో ముగియనున్నన్నది. ఈ నేపద్యంలో గురువారం జనసేన పార్టీ తరఫున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గురువారం తాండూర్ లో నామినేషన్ దాఖలు చేయగా ప్రముఖ వ్యాపారవేత్త ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట్లో 32 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైన జనసేన పార్టీ బిజెపితో పొత్తులో భాగంగా 8 సీట్లలో మాత్రమే పోటీ చేయడానికి జనసేన సిద్ధపడింది. అయితే 32 స్థానాల్లో పోటీకి సిద్ధమైన యువనాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారిని నిరాశ పడవద్దని మీ త్యాగం ఊరికే పోదు అని ఆయనను నమ్మి ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ త్యాగం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక ఆయన ఈ స్థాయికి రావడానికి దశాబ్దకాలం పట్టిందని మీకు భవిష్యత్తులో మంచి నాయకత్వ అవకాశాలు వస్తాయని ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు వెళ్తారని తెలిపారు. జనసేన-బీజేపి కూటమిని బలపర్చాలని కోరారు.