రాష్ట్ర భవిష్యత్తు, యువతకు భరోసాకు జనసేనపార్టీని ఆదరించాలి: కోన తాతారావు

గాజువాకలో ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి 66వ వార్డులో ఇందిరా కోలనీ, కొత్త గాజువాక, బీసీ రోడ్డు, సీతారామ్ నగర్, అజీమాబాద్, కణితి రోడ్డు, మార్కెట్ ప్రాంతాల్లో జనసేన పిఏసి సభ్యులు, గాజువాక ఇంచార్జి కోన తాతారావు పాదయాత్ర చేపట్టారు. యువతకు ఉపాధిలేక ప్రతి ఇంటిలోనూ ఒక్కరు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళటం, ఎక్కడ చూసినా అద్వానమైన రోడ్లుతో ప్రజలు సమమతం. అడ్డు అదుపులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుదల, కొనుగోలు శక్తి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందిలు ఎదుర్కొంటూరని పాదయాత్రలో నేరుగా కనిపించాయన్నారు. వైసిపి పాలనలో ముస్లిమ్ సోదరులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పదకాలు అందకపోవటం, వున్న పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. పేద వాడికి పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ లను రద్దు చేయటం బాధాకరమని ప్రజలు వాపోతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు చిన్నపాటి ఇళ్ళు కట్టుకోవాలంటే వైసిపి కార్పొరేటర్లకు లక్షల్లో లంచాలు ఇవ్వాల్సి వస్తుందని కోన తాతారావు దృష్టికి ప్రజలు తేవటం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకంలోనూ వైసిపి నేతల అవినీతి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, దౌర్జన్యాలు కనిపించేయన్నారు. ప్రజలు వైసిపి ప్రభుత్వంపై విసుగు చెందారని, రాబోయ్యేది జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తారని తెలిపారు. బడుగు బరహీన, మైనారిటీ వర్గాలకు తోడుగా నిలుస్తామని, ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉండి, సుపరిపాలన అందించడమే దేయంగా పనిచేస్తాం అని కోన తాతారావు ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో 66వ వార్డు అధ్యక్షులు పోల రౌతు వెంకట రమణ,జనసేన నాయకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, లంక లతా, గంధం వెంకటరావు, వీరబాబు, మహ్మద్ ఆలి, మల్లిక, జిలాని, వరసాల శ్రీనివాస్, భాషా, అల్లాడ రవీంద్ర, వల్లి, మాక షాలిని, సాడె రామారావు, సనపల ఢిల్లేశ్వరావు, జ్యోతి రెడ్డి, కాదా శ్రీనివాస్, లంకల మురళిదేవి తదితరులు పాల్గొన్నారు.