విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన బాధితురాలికి జనసేన పార్టీ చేయూత

కంచికచర్ల హనుమాన్ పేటలో ఇటీవల విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల వంట సామాగ్రి దుస్తులు తదితర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కంచికచర్ల హనుమాన్ పేటలో నివాసముంటున్న పెద్దినీడి శివపార్వతి ఇంట్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ ఆస్తి నష్టం వాటిల్లడంతో జనసేన పార్టీ నాయకులు అండగా నిలిచారు. కంచికచర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్ ఆధ్వర్యంలో శివపార్వతి ఇంటిని పరిశీలించి 15000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున 15000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే దాతల సహాయ సహకారాలు అందించాలని బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ నెంబర్ ఓంకార్, మండలం నాయకులు పెద్దినీడి హరి, పుప్పాల వేణు, కుర్రా నాని, కోనేటి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.