జనసేన పార్టీ యువశక్తి పోస్టర్ల ఆవిష్కరణ


పాలకొండ: వీరఘట్టం మండలం తేది: 06-01-2023 పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజక వర్గం వీరఘట్టం మండలం కేంద్రం లో జనసేన పార్టీ యువశక్తి పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు. యువత పక్షాన జనసేన శ్రీకాకుళం జిల్లా, ఎచ్చర్ల నియోజక వర్గం, రణస్థలంలో యువశక్తి, మన యువత – మన భవిత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకులు బి.పి.నాయుడు కోరారు. మత్స పుండరీకం మాట్లాడుతూ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని యువత నిర్వీర్యమైపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి చూపించలేక పోయింది. పరిశ్రమలు స్థాపించలేకపోయింది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి కూడా ఖాళీలు ఉన్న ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కల్పించ లేకపోయింది. ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. యువత పక్షాన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈనెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. సామాన్య యువతి యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించారు. ఆసక్తిగల యువతి, యువకులు 08069932222 నంబర్, ఈ మెయిల్ vrwithjspk@janasenaparty.org సంప్రదించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జనసేన జాని మాట్లాడుతూ ఒక తరాన్ని నిర్వీర్యం చేసి అవినీతి అక్రమార్జనతో అధికార మదమెక్కి విర్రవీగుతున్న వైస్సార్సీపీ ప్రభుత్వంపై అందరం కలిసి నిలదీద్దాం రణస్థలంలో రణభేరి మోగిద్దాం. ఆంధ్రప్రదేశ్ యువతకు భరోసా కల్పిద్దాం. రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగురవేద్దాం అని అన్నారు.