ఏలూరు నియోజకవర్గ ప్రజల సమస్యలపై జనసేన వినతి పత్రం

ఏలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న 7 రకాల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేసిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు..

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

1) ఏలూరు అసెంబ్లీ పరిధిలో ఏడు గ్రామ పంచాయతీలు 2020-2021 సం.లో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన సంగతి తెలిసిందే.. సదరు ఏడు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏ విధమైన అభివృద్ధి పనులు చేపట్టలేదు.. ఆయా ప్రాంతాల్లో ఇంటి పన్ను, నీటి పన్ను వగైరాలను మున్సిపల్ కార్పొరేషన్ వారు వసూలు చేస్తున్నారు.. సదరు కలెక్టర్ గారు 5 సం.లు విలీన ప్రాంతాలలో పాత పంచాయతీ పన్నుల విధానం కొట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించగలరు.. రాయితీలను ఇచ్చి ఆ పన్ను భారం నుండి ప్రజలను విముక్తి చేయాలి..

2 ) ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరి జలాలు శుధ్ధి చేయబడి త్రాగు నీటిగా సరఫరాగా చేయబడుచున్నది.. కానీ విలీన గ్రామ పంచాయతీల పరిధిలో గోదావరి కాలువ నుండి రక్షిత త్రాగునీరు ఆ విధంగా సరఫరాకు చేయబడలేదు.. తక్షణమే ఆయా ప్రాంతాల్లో పైపులైన్లు విస్తరింపజేసి గోదావరి జలాలు సరఫరాకు శ్రీకారం చుట్టాలి…

3) విలీన గ్రామ పంచాయతీల పరిధిలో ఇంతవరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు కాబడటం వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి పొంది జీవనం సాగించేవారు.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం జరిగిన తరువాత ఆయా ప్రాంతాల్లో ణ్.ఋ.ఏ.ఘ్.శ్ నిధులు విడుదల కావడం లేదు.. కావున ఆయా ప్రాంతాల ప్రజలు ఉపాధికి తక్షణ ఏర్పాట్లు చేయాలి..ఈ సమస్య 10,516 కుటుంబాల్లోని 18,232 కూలీలకు సంబంధించినది గా గుర్తించి ప్రత్యున్నయ ఉపాధి కల్పించాలి..

4) ఏలూరు నగర పరిధిలో ఉన్న శ్రీ కృష్ణ జ్యూట్ మిల్లును ఏ విధమైన ముందస్తు ప్రణాళికలు లేకుండా మూసివేసి 2000 వేల మంది కార్మికుల ఉపాధి పోగొట్టారు.. తక్షణమే ఆ జ్యూట్ మిల్లు యాజమాన్యం పై తగు చర్యలు తీసుకొని తెరిపించి ఆ కార్మికులకు తిరిగి ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలి..

5) విలీనమైన గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.. డ్రైనేజీ సానిటరీ సమస్యలు అధికంగా ఉన్నాయి.. స్థానిక శనివారపు పేట 25 వ డివిజన్ లో దేవాంగుల పేటలో మురుగునీరు రోడ్లపై ప్రవహించి దుర్వాసన, దోమలు, ఈగలు, కలుషిత మంచినీటి కులాయి సరఫరా జరుగుతుంది.. ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు..ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.. వెంకటాపురం పంచాయతీ లోని 5 వ డివిజన్ సెయింట్ జాన్స్ స్కూల్ వెనకాల ప్రతి వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపై ప్రవహించి సుమారు మీటరున్నర లోతు నీరు రోడ్డు పై ప్రవహిస్తుంది.. దాని వలన మురుగు పేరుకుపోయి విపరీతమై దోమ కాటుకు గురై అనేక రోగాల బారిన పడుతున్నారు..

6) ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీన పరచడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది..కావున ఆ ఇళ్ళను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీన పరిచి వారికి న్యాయం చేయాలి..

7) ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి చెత్త సేకరణకు పన్ను విధించి వసూలు చేస్తున్నారు.. అలా విధిస్తున్న పన్నును రద్దు చేసి సామాన్యులపై పడే భారాన్ని తగ్గించాలి..

ఈ ఏడు రకాల సమస్యలపై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు..

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్,జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, నాయకులు నిమ్మల శ్రీనివాసు, పండు తదితరులు పాల్గొన్నారు..