జనసేన ప్రభంజనం.. కనీవినీ ఎరుగని రీతిలో భారీ ర్యాలీ

  • పాతవెలుగుబంద గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పాతవెలుగుబంద గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా కొత్త వెలుగుబంధ శివాలయం వద్ద నుండి పాత వెలుగుబంద గ్రామం వరకు జరిగిన భారీ బైక్ ర్యాలీలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ కు ఘన స్వాగతం పలకడానికి వందలాదిగా జనసైనికులు తరలివచ్చి బ్రహ్మరధం పట్టారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. నేను ఒక రైతు బిడ్డని ఇక్కడే పుట్టి పెరిగాను. ఇక్కడ నివసించే ప్రజల కష్టాలు అన్ని నాకు తెలుసు. రాజానగరం నియోజకవర్గంలో చెరువులు, కొండలు, ఇసుకను దోచేస్తూ రాబోయే 10 తరాలకు సరిపడా డబ్బులు అక్రమంగా సంపాదించి ప్రజలకు అభివృద్ధి పేరుతో సున్నం కొట్టారు. అధికార పార్టీ వారు, ప్రతిపక్ష పార్టీ వారు పలు రకాలుగా ప్రలోబాలకు ప్రయత్నించినా నేను ఎవరికీ లొంగకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి కష్టమైనా, నష్టమైనా, మంచైనా, చెడైనా మీతోనే ఉండాలి.. మీతోనే బతకాలి అనే ఉద్దేశంతో జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. జె టాక్స్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ జగన్ టాక్స్ & జక్కంపూడి టాక్స్ వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మద్యం ధరలు అధికంగా పెంచేసింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఈరోజు గూగుల్ పే, ఫోన్ పే వాడుతుంటే మద్యం షాప్ లో మాత్రం గూగుల్ పే, ఫోన్ పే లాంటివి పెట్టకుండా ఎం.ఆర్.పి ధర కంటే అధిక ధరకు విక్రయిస్తూ అధికార పార్టీ నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు. మా ఇంటి నుండి నలుగురు పనిచేసున్నారని అంటున్నారు కానీ మా ఇంట్లో పనిచేసేది నలుగురు కాదు 50 వేల మంది నా కుటుంబసభ్యులు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. బత్తుల వెంకటలక్ష్మి ఎంపీటీసీగా గెలిచిన తర్వాత 6 నెలలు సొంత గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారు. వెంటనే పదవికి రాజీనామా చేసారు. రేపు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు పనితీరు నచ్చకపోతే 3 నెలల్లో రాజీనామా చేస్తాం తప్ప మీ ఆత్మభిమానం దెబ్బతీసే పని మేము చేయము అని హామీ ఇస్తున్నాము. ఈ జనంకోసం జనసేన మహాపాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో కుటుంబాలను కలిసి ప్రజల కష్టాలను చూసి ఇంత కష్టంలో నా నియోజకవర్గ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. అని చలించిపోయి తన ఆస్తి కూడా ప్రజలకు ఖర్చుచేయమని చెప్పింది నా సతీమణి అని గర్వంగా చెప్పుకుంటాను. జీవితకాలం ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే మనకి మంచి ప్రభుత్వం రావాలి. ఆంధ్రప్రదేశ్ కి దొరికిన ఆణిముత్యం పవన్ కళ్యాణ్.. అలాంటి నాయకుడుని మనం గెలిపించుకోవాలి. అప్పుడే మన కష్టాలు బాధలు తీరుతాయి అని బత్తుల బలరామకృష్ణ తెలిపారు. భారీగా జరిగిన ఈ పాదయాత్రలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-06-23-at-4.37.57-PM-1024x721.jpeg