ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకును తక్షణం పూర్తిచేయాలి

  • హలో ఏపీ.. బై బై వైసీపీని మేము ప్రజల్లోకి తీసుకువెళతాం
  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి మండలం, చిప్పిలి గ్రామంలో కొండ మీద ఉన్న నీటిశుద్ది ప్లాంట్ ని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గడపగడప తిరుగుతూ 98% హామీలు నెరవేర్చామని వై నాట్ 175 అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండటం సిగ్గుచేటు. మదనపల్లి ప్రజల దాహార్తి తీర్చే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దాదాపు 90 శాతం పూర్తి అయినా మిగతా 10 శాతం పనులను పూర్తి చేయకపోవడం వలన పేద ప్రజలు మధ్య తరగతి కుటుంబాలు నెలకి కొన్ని వందల రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొనుక్కోవడం జరుగుతుంది. ఇకనైనా వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వదిలి పనులు పూర్తి చేయాలని, చేయని పక్షంలో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మదనపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వెళ్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో చర్చించి దీనికి సపరేటు బడ్జెట్ కేటాయింపు చేసి పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు హలో ఏపీ.. బై బై వైసీపీని మేము ప్రజల్లోకి తీసుకువెళతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, మదనపల్లి రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, గడ్డం లక్ష్మీపతి, జనార్దన్, గండి కోట లోకేష్, నవాజ్, సత్య తదితరులు పాల్గొన్నారు.