అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన నిరసన

గుంటూరు, అధికార పార్టీ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తూ ఇంటి గోడలపై జగన్ రెడ్డి స్టిక్కర్లు అతికించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్లో, అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేపార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నిరసనలో గాదె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అందరికీ జనసేన పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ శ్రేణులు చేస్తున్న నిర్వాహకం ముందుగా నేను అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతున్నాము. దేనికి అంటే మనస్సాక్షి చంపుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజా ప్రతినిధులుగా ఉండి మెడలో పార్టీ సంచులు వేసుకొని ఇంటింటికి తిరుగుతూ గోడలకు స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఎంత సిగ్గుచోటో ఆలోచించాలి అందుకే మేము అధికార పార్టీ నాయకులకు సంతాపం తెలుపుతున్నాము. జగన్ రెడ్డి అని నమ్మండి అంటూ జనాల్లోకి వస్తున్నాడు ఎందుకు నమ్మాలి….? ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన మాటలు, చేతలు గాని ఏమి చేశావు. అధికారంలోకి వచ్చిన వారంలోపే సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు. నేను అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా కట్టి చూపిస్తా అన్నావ్ కానీ మూడు ముక్కలు చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రాన్ని ఉంచావు. నేను అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని విద్యార్థులను మోసం చేసినందుకా..? దసలవారీగా మద్యపానం నిషేధం చేస్తా అని అన్నావు కానీ మద్యం ఏరులు పారిస్తున్నావ్. అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసినందుకా..? నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తువా… దేనికి భవిష్యత్తు..? రాష్ట్రంలో ఉన్న ప్రకృతి సంపదను దోచుకు తింటూ, దాచుకుంటున్నావు అదేనా భవిష్యత్తు..? లేక భవిష్యత్ తరాల ఉపయోగపడే ప్రతి జాగాని, విలువైన భూములను అమ్ముకోవడం లేదా తాకట్టు పెట్టుకున్నందుకా భవిష్యత్తు.? రిటైర్ అయిన ఉద్యోగులు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారికి రెండు సంవత్సరాల కాలపరిమితి పెంచి యువతకు ఉద్యోగాలు లేకుండా చేసినందుకా.? మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఒక్క మంత్రికి గాని ఎమ్మెల్యే గాని ఉంటే మాతో చర్చకు రావాలని సవాల్ విసురుతున్నాం. అధికార పార్టీ వారి అధికార మదంతో ఇంటి ఇంటికి వచ్చే స్టిక్కర్లు అంటించడం వద్దు అని వ్యతిరేసుకిస్తున్న వారిపై కేసులు పెడతామని బెదిరించడమా..? నిజంగా భవిష్యత్తు నువ్వు అధికారంలోకి రావాలి అంటే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నమ్మి నువ్వు రావాలి నువ్వే కావాలని మిమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తారు కదా. ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా అని మీరు చెప్పే కాకమ్మ కథలు నీ దొంగ రాజకీయాలు మొదలు పెట్టావు అని ఇది ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడుగుతున్నాము మీ నియోజకవర్గాల్లో ప్రజలకు ఏమి చేశారు వారికి మీరు అధికారంలోకి వచ్చాక కొత్తగా ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఇంకేమైనా ఆదాయాలు వచ్చే మార్గాలను ఏమైనా చేశారా అసలు మీకు సిగ్గు ఉంటే ఇలా మళ్లీ ఇంటింటికి తిరిగి భుజాన సంచి తగిలించుకొని స్టిక్కర్లు అంటించుకుంటూ మళ్లీ మాకు ఓటు వేయాలని అడుక్కోవడమేంటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.