తధేకం పౌండేషన్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్

జగ్గంపేట మండలం, జనసేన పార్టీ నాయకులు పాలిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో తధేకం పౌండేషన్ సహకారంతో గుర్రప్పాలెం జనసేన సైనికుల సారథ్యంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కి జగ్గంపేట కార్తికేయ హాస్పటల్ వారి సౌజనంతో అనుభవజ్ఞులైన డాక్టర్ పర్యవేక్షణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ సుమారు 200 మంది పైగా సాదారణ ఆరోగ్య సమస్యలు దగ్గు, జ్వరం, ఆయాసం, కీళ్ల నొప్పులు, తలపోటు, బీపీ, షుగర్ అన్ని రకముల ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి డాక్టర్ సూచనమేరకు ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండలాద్యక్షులు ఉలిసి అయిరాజు, నియోజకవర్గ నాయకులు బీడీల రాజబాబు, గోకవరం మండల మహిళా అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, మండలకార్యదర్శి మానల్తి దుర్గానప్రసాద్, మండలకార్యదర్శి బద్ది సురేష్, మీడియా కార్యదర్శి సైతాన నాగేశ్వరరావు, గోకవరం మండల వీరమహిళ పువ్వుల శ్రీదేవి తదితరులు పాల్గన్నారు.