జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి హౌస్ అరెస్ట్

తిరుపతి: తిరుపతిలో జనసేన నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసారు. జిల్లా పోలీసులు. స్థానిక చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న తాజ్ హోటల్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాక సందర్భంగా తిరుపతిలో జనసేన శ్రేణులను పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం తగదు. ప్రజలే సిఎం ను పట్టించుకొనే పరిస్థితిలో లేరు ఇక మేము ఎందుకు పట్టించుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన మీద విశ్వాసం నమ్మకం ఏవి లేవు, రానున్న మరో మూడు నెలల్లో దిగిపోయే వ్యక్తి గురించి పట్టించుకోని మా సమయాన్ని మరియు గౌ పోలీసు వారి సమయాన్ని వృధా చేయకండి. చంద్రగిరి నియోజకవర్గంలో కి సిఎం వస్తె తిరుపతిలో అరెస్ట్ చేయడం అనేది పిరికిపంద చర్యగా భావించాలి, దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.