ఆరవ రోజు సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఆరవ రోజుకు మద్దతుగా జనసేన పార్టీ నిలిచి సులభ్ కార్మికులకు మధ్యాహ్నం అన్నదానం డా పసుపులేటి హరి ప్రసాద్ ఏర్పాటు చేయడం జరిగింది. సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె గత ఆరు రోజులుగా ఉన్న అధికారులు ఎవ్వరు పట్టించుకోవటం లేదు. టీటీడీ పారిశుద్ధ కార్మికులు మీకు నోరు లేని వారిలాగా కనిపిస్తున్నారా లేక మూగజీవలు అనుకున్నారా. వీరికి అండగా జనసేన పార్టీ, ఎప్పుడు అండగా ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియచేసారు. 26 సంవత్సరాలనుండి సులభ కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తుంటే వారికి జీతం కూడా సరిగ్గా ఇవ్వకుండ చేస్తున్న టీటీడీ యాజమాన్యం. ఇన్నిరోజులుగా వారు ఎవరికీ ఎదురుతిరగకుండా ఉన్న వారు ఈరోజు వారు ఎందుకు రోడ్డున పడ్డారో భగవంతునికి భక్తులకు తెలియాలి. వారి శ్రమకు ఇవ్వవలసిన వేతనం ఇవ్వకుండా, సెలవు దినములు లేకుండా పని చేయిస్తున్నారు అంటే వారు నోరు లేని మూగజీవలు గాక మరేంటి. ఈ మూగ మనుషులు కడుపు చేతపట్టుకొని రోడ్డున పడ్డారు ఎక్కడైనా ప్రపంచంలో జీతం పెరుతుందే కానీ తగ్గే అవకాశం ఎక్కడ ఉండదు అలాంటిది వారికి రూ.11046/- జీతం నుంచి 8000 రూపాయల వరకు తగ్గిస్తాం అనగానే వీరి మనసులో మంటలు రేపింది. ఆ గుండెల్లో మంట దాదాపు 3700 మంది కార్మికులు ఒక్కమాటపై తమ విధులను బహిష్కరించి రోడ్డు పైకి వచ్చారు. వారేమి టీటీడీ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించలేదు, తమగొడును విన్నవించుకోవటానికి గాంధేయ పద్దతిలో అందరూ ఆ శ్రీ కృష్ణుడి గుడి (ఇస్కాన్) ముందు ఉన్న మైదానంలో కూర్చొని నిరసన తెలుపుతుంటే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ చదువుకున్న అధికారులు వీరిపైన యుద్ధం ప్రకటించిన తీరు చాలా బాధను కలిగిస్తుంది. వారు రేపు టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ సుబ్బారెడ్డిని కలవటానికి వినతిపత్రం తయారు చేసుకొని పత్రికాముఖంగా వారి అభ్యర్థనను విన్నవించు కోవాలనుకుంటున్నారు. దయవుంచి వారి గోడును వినటానికి పెద్దలు స్పందిస్తారని వారి న్యాయభధ్ధమైన కోరికలను తీరుస్తారని మేము అందరూ ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్సులు పి. ఆనంద్, బాటసారి, తిరుపతి పట్టణ నాయకులు, పార్థు, మనోజ్, లక్ష్మి, రుద్ర కిషోర్, కిరణ్ కుమార్, సాయిదేవ్ యాదవ్, హేమంత్, బాలాజీ, పురుషోత్తం, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.