అనంతపురం అర్బన్ లో మహిళలతో జనసేన మాట, మంతి

  • ఏ ముఖం పెట్టుకొని ఇంటింటికీ వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేస్తున్నావ్ అనంత వెంకట రామిరెడ్డి
  • అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మహిళలతో మాటమంతి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలను అడుగుతుంటే నీ అవినీతి అరాచకాల వల్ల నష్టపోయిన వారే ప్రతి ఇంట్లో కనపడుతున్నారు
  • ఇప్పటివరకు పూర్తికాని గృహాలు, పెరిగిన విద్యుత్ బిల్లులు నిత్యవసర ధరలు, వెరసి చెత్తపన్ను, విచ్చలవిడి మద్యం అమ్మకాలు డ్రగ్స్ సరఫరా, డంపింగ్ యార్డ్ తరలింపు, అంతర్ బాగా డ్రైనేజీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాటేడంత లిస్ట్ఏఉంది
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాట మంతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 22వ డివిజన్ బుడ్డప్ప నగర్ లో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకుని ఈ విధంగా మాట్లాడారు. అయ్యా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరో మారు అర్బన్ ప్రజలను మోసం చేయడానికే ఇంటింటికి వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేస్తున్నావా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఇంటింటికి తిరుగుతున్నావని మేము అడుగుతున్నాము.. మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలతో మాటమంతి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలను మీ సమస్యలు ఏమిటి అని అడుగుతుంటే స్థానిక మహిళలు కన్నీటి పర్యంతం అవుతూ నీ అవినీతి అరాచకాల వల్ల నష్టపోయినవారే కనపడుతున్నారని నువ్వు అర్బన్ లో ఇప్పటివరకు పేదవారికి ఇల్లులు ఇంకా ఇవ్వలేదని గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను గాలికి వదిలేశారని వారికి సొంత ఇల్లు లేక బాడుగ ఇళ్లల్లో జీవనం సాగిస్తూ పెరిగిన విద్యుత్ చార్జీలతో బాడుగలకు సమానంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని వాపోతున్నారని నిత్యవసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని వీటికి తోడు చెత్త పన్ను మధ్యతరగతి ప్రజల ప్రాణాలు తీయడానికి విచ్చలవిడి మద్యం అమ్మకాలు యువతను తప్పదోవ పట్టించడానికి డ్రగ్స్ సరఫరా, నగరం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పటివరకు డంపింగ్ యార్డు తరలింపు ప్రక్రియే చేపట్టలేదని ఇక అంతర్భాగ డ్రైనేజీ వ్యవస్థ మాట అటు ఉంచితే మురుగు కాలువ వ్యవస్థ నగరంలో అస్తవ్యస్తంగా ఉందని ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేయని అభివృద్ధి చాటడంత లిస్ట్ ఏ ఉందని.. నువ్వు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఈసారి కచ్చితంగా జనసేన టీడీపీ పార్టీలకే ప్రజలు పట్టం కడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.