ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం: చిర్రి బాలరాజు

  • సొంత ఖర్చుతో తుక్కు తొలిగింపు పనులు, గుంతల పూడికలు చేయించిన చిర్రి బాలరాజు

పోలవరం: గత కొంతకాలం క్రితం అకాల వర్షాల వల్ల పోలవరం నియోజకవర్గంలో జీలుగుమిల్లి బుట్టాయిగూడెం మధ్య రహదారిలో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. మలుపుల వద్ద భారీగా తుక్కు పేరుకుపోవడం వల్ల నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేకు, సంబంధిత అధికారులకు అధికార నాయకులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు తన సొంత ఖర్చుతో తుక్కు తొలిగింపు పనులు, గుంతల పూడికలు చేయించారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి, ప్రజల సమస్యలు తీర్చడానికి అధికారంలో లేనప్పటికీ తాను ప్రజల సమస్యలపై పోరాడుతానని, ప్రజల సమస్యలు తీర్చడంలో తన వంతు బాధ్యతగా తన పాత్ర పోషిస్తానని అన్నారు. సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ జనసేన పార్టీ అక్కడికి వస్తుంది, సమస్య పరిష్కరిస్తుంది అన్నారు. అధికారం లేకుండానే ఇన్ని పనులు చేస్తే అధికారం ఇస్తే ఇంకెన్నో మంచి పనులు చేస్తారని అని ప్రజలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల కార్యదర్శి చిర్రి రాంపండు, కార్యకర్తలు పాల్గొన్నారు.