అభివృద్ధిని జనసేన స్వాగతిస్తోంది – ప్రజల ముంపును వ్యతిరేకిస్తోంది: దేవి హారిక

కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణం 8వ వార్డులో ఉన్న గరిగుంట చెరువు వల్ల వర్షం కురిసినప్పుడు రెండు వార్డుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 7వార్డు జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక అన్నారు. ముంపు నీరు దిగక దుర్గందంలోనే ప్రజలు కొట్టుమిట్టడుతున్నారని, అభివృద్ధిని జనసేన స్వాగతిస్తోందని 7వార్డ్ జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక అన్నారు. 8వ వార్డు కౌన్సిలర్, పురపాలక వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ అభివృద్ధిని అడ్డుకున్నట్లు మాట్లాడుతున్నారన్నారు. గరిగుంట చెరువు అవుట్లెట్స్ తెరిపించి వీధులు ముంపునకు గురికాకుండా చూడండి. శ్రీ శ్రీ శ్రీ సర్వ మంగళ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ఎన్నడూ లేనివిధంగా మురుగు నీరు ఎందుకు వెళ్ళింది అనే దానిపై దృష్టి పెట్టి సమస్య పరిష్కారం చేస్తే సంతోషిస్తాం. 20 లక్షలు కాదు 60 లక్షలతో అభివృద్ధి చేయండి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వైస్ చైర్మెన్ వెంకటేష్ చూడాలని, తాను కోరుతున్నానని జనసేన కౌన్సిలర్ దేవి హారిక అన్నారు.