సచార్ కమిటీ ద్వారా జనసేన ముస్లింలకు అండదండగా నిలబడుతుంది

అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల వరకు ముస్లింలకు దళిత మైనారిటీలకు ఎన్నికల హామీల్లో భాగమైన దుల్హన్ పధకం గుర్తుకు రాలేదు కాని ఎలక్షన్ లు త్వరలో రాబోతున్నాయన్న వార్తల్లో భాగంగా వైసిపి వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఆ పథకాన్ని చేబడతామని చెప్పడం ముస్లిం ప్రజానీకానికి ఓటు బ్యాంకుగా భావించే వైసిపి పథకంలో భాగమేనని ప్రతి ముస్లిం సోదరుడు, సోదరీమణులు అర్ధం చేసుకోవాలి. మాట తప్పం మడమ తిప్పం అన్న వైసిపి మరియు జగన్ రెడ్డి మీరు ముస్లింల విషయంలో కూడా మాట తప్పారు మడమ తిప్పారు. 2019 లో అధికార దాహంతో ఉన్న మీరు ముస్లిం మైనారిటీలలోని యువతి వివాహానికై దుల్హన్ పధకం కింద ఆర్ధిక సహాయాన్ని 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఇస్తామని మాట ఇచ్చి అధికారం చేపట్టగానే మాట మార్చారు. ఇది మీ ప్రభుత్వానికి కాని మీకు కాని ఎంతవరకు సబబో చెప్పాలి. వైసిపికి ఓటు వేస్తే ముస్లిం ప్రజానీకానికి మంచి జరుగుతుందని డప్పు కొట్టి మరీ ఓట్లు వేయించిన ముస్లిం మత పెద్దలు మరియు నియోజకవర్గ మైనారిటీ నాయకులు ఈరోజున ఏమైపోయారు? ప్రభుత్వాన్ని కాని మీ నాయకుడిని కాని నిలదీయడమనేది ఏమైనా ఉందా..? లేక జీహుజూర్ అని వైసిపి మోకాలి నీళ్లు తాగడమేనా..? నా ముస్లిం సోదరులకు ఒక ముస్లిం మైనారిటీ జనసైనికుడిగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మనం ఎన్నాళ్లు అని ఇలా మోసపూరిత హామీలతో మోసపోతూ వారి పల్లకిలు మోద్దాం. దయచేసి ఇకనైనా మార్పు కోరుకుందాం. కుల మతాలకు అతీతంగా రాజకీయాల్లోకి మార్పును తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి ఒక అవకాశం రానున్న ఎన్నికలలో ఇద్దాం. ఆయన ద్వారా మన హక్కులను మనకు రావాల్సిన ప్రయోజనాలను పొందుదాం. సచార్ కమిటీ ద్వారా జనసేన పార్టీ మనకు అన్ని విధాలుగా అండదండగా నిలబడేందుకు కృషి చేస్తుంది. కాబట్టి మనం అవివేకాన్ని అజ్ఞానాన్ని వీడి గత రాజకీయాలను పక్కన పెట్టి మార్పుదిశగా పయనిద్దామని ఎన్నారై జనసేన నాయకులు అలి షేక్ అన్నారు.