కొంతేరులో జనసేన కార్యవర్గ సమావేశం

పాలకొల్లు నియోజకవర్గం: కొంతేరు గ్రామంలో జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై చర్చించారు. ప్రజలనుంచి గత వారం రోజుల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి కచన్ డ్రైన్స్, నూతన ఓటర్స్ నమోదు, పసర్లుగా మారిన కుళాయి నీరు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం కుళాయి చెరువు పరిశీలించారు. కొంతేరు నుంచి గగ్గిపర్రు వరకూ పాదయాత్రగా వెళ్లి మంచి నీరు వచ్చే బోదెలో డ్రైన్ వాటర్ కలిసిపోయిన విషయాలను ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ చరవాణి ద్వారా సెక్రటరీకి ఫీల్డ్ నుంచి మాట్లాడి తెలియజేసారు. సెక్రటరి సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. కొంతేరు గ్రామాన్ని ఇటు పంచాయితీ అటు మున్సిపాలిటీ కాకుండా చేసేశారని, రెండు వైపుల ఉన్నది వైకాపా నాయకులే అని మళ్ళీ ఏమి తెలియనట్టు కుంటి సాకులు చెబుతున్నారని, ఈ సమస్యను ప్రజా కోణంలో అలోచించి పరిస్కారం చూపాలని, లేని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదని వై.కా.పా నాయకులను హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలిశెట్టి సర్వరావు, అంబటి నాగ రవి కిరణ్, సుదర్శనం శ్రీనివాస్, కనపాల దాసు, త్సవటపల్లి సతీష్, అడ్డాల నాగేశ్వరారావు, వేపుగంటి వెంకట రమణ,ఐ. యన్. వి సత్యనారాయణ, ఎ. దొరబాబు, పాలింకి మణికంఠ, కె. వి. ఎన్. పి. కుమార్, సి హెచ్ కుమార్, ఎ. నరేష్ కుమార్, అంబటి ఏసు, జి. కార్తీక్, సి. హెచ్ సర్వణ్, జి. అభిషేక్, ఎ. కార్తిక్, ఉగ్గిరాల సతీష్, నేదునూరి సూరిబాబు, పున్నం సాయి, అంబటి నరసింహా రావు, మంచెం స్వామి, పవన్, కె. సతీష్, ఎ. రాయుడు, జి. కృష్ణ, కె. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.