రోజా దిగజారద్దు – తిరుపతిలో అడుగుపెట్టలేవు: వీరమహిళల హెచ్చరిక

తిరుపతి: వైకాపా అధిష్టానం రానున్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మరోసారి మంత్రి పదవి తిరిగి కట్టబెడతారని ఫేస్ కు మేకప్ వేసుకుని, నోటికి హద్దు అదుపులేకుండా మంత్రి రోజా ఓ కంత్రీలా.. మా జనసేనాని రాష్ట్ర పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ పై రోజా నోరు పారేసుకోవడం మంచిది కాదంటూ, రోజా ధోరణి ఇలానే ఉంటే తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు జనసేన పార్టీ వీరమహిళలు జిల్లా ప్రధాన కార్యదర్శి బీగాల అరుణ పట్టణ ప్రధాన కార్యదర్శి చందన, పట్టణ కార్యదర్శులు దుర్గ, మధులత, శిరీషలతో కలిసి ఆకేపాటి మాట్లాడుతూ వైజాగ్ ప్రాంతంలో వారాహి పర్యటనలో అక్కడ దొంగ బంగారం, గంజాయి రవాణాపై తమ జనసేనాని నిజాలను ప్రశ్నిస్తే తప్పా అన్నారు. విస్సన్నపేట, గాజువాక ప్రాంతాల సభలో సునామీ నుండి కాపాడేలా భద్రత తో కూడి ఉన్న ఋషికొండను బోడి గుండు చేసిన వైసిపి దోపిడీకి అంతులేదా ఆని పవన్ ప్రసంగిస్తే, తమ జనసేనానికి హార్ట్ ఎటాక్ రావాలని రోజా శపించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలను దోచేస్తున్న వైకాపాలన నుండి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలనే తపనతో తమ జనసేనాని అన్నింటిని త్యజించి ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తే.. రోజాలా కత్తి మహేష్ కూడా మా పవన్పై మాటల దాడి చేశాడని అందుకే గుండెపోటుతో మరణించాడని, ఇదే గతి శ్రీ రెడ్డికి, రోజాకు కూడా పడుతుందని మాట్లాడే అప్పుడు దిగజారద్దు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వైకాపా మంత్రులతో సహా రోజా సీఎం వేసే బిస్కెట్లకు ఆశపడి రోజా తమ అధ్యక్షుడిపై నోరు పారేసుకుంటున్నదని, నెత్తిపై రూపాయి పెడితే పావలా కి కూడా అమ్ముడు పోనీ ఐదు పైసల రోజా
పెద్ద జ్ఞానిలా తమ పవన్ కళ్యాణ్ పై తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని రోజా ధోరణి. ఇలాగే సాగితే వీరమహిళలంతా పొరకలతో కొడతామని హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలిపిరి నడకదారిలో భక్తులకు సీఎం జగన్ ఫోటోతో కూడిన కర్రలు ఇచ్చి, చిరుత పులి నుండి వారిని కాపాడుకోవాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు, దీనికన్నా సీఎం మాస్క్ భక్తులు వేసుకొని వెళ్లేలా ప్రవేశపెడితే, పులివెందుల వైయస్ జగన్ ను చూసి పులి పారిపోతుందంటూ చురకలు విసిరారు.