జనఘోష – జనసేన భరోసా కార్యక్రమానికి విశేష ఆదరణ

  • జనఘోష జనసేన భరోసా కార్యక్రమానికి విశేష స్పందన
  • పార్కు ఆంజనేయ వీధిలో నుంచి తొలి రోజు దిగ్విజయంగా ప్రారంభమైన జనఘోశ జనసేన భరోసా కార్యక్రమం

ఉరవకొండ నియోజకవర్గం: వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను వివరిస్తూ.. పట్టణ ప్రజలకు భరోసానిస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలను మమేకం చేస్తూ.. ఉరవకొండ నియోజకవర్గ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన జనఘోష – జనసేన బరోసా కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ఉరవకొండలో స్థానిక పార్కు ఆంజనేయ వీధి నుంచి తొలి రోజు దిగ్విజయంగా జనఘోష జనసేన బరోసా కార్యక్రమం ప్రారంభించడమైనది. కార్యక్రమంలో ముందుగా జనసేన కార్యాలయం నుంచి పార్కు ఆంజనేయ స్వామి ఆలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గౌతమ్ కుమార్ నాయకత్వంలో శ్రేణులు జనసేన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ ఇంటింటికి వెళ్తూ.. అందరిని పలకరిస్తూ మాట్లాడారు. అదే సందర్భంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలను వివరిస్తూ.. తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఉరవకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలియ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో అభివృద్ధికి ఇచ్చిన హామీలు కూడా స్థానిక నాయకులు అమలు చేసిన పాపాన పోలేదన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలంటే అది జనసేనతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. మీకు అన్నివేళలా తాను అండగా ఉంటానని. మీకు ఏ సమస్య వచ్చినా తాను ముందు నిలుస్తానని గౌతమ్ కుమార్ భరోసా ఇచ్చారు. అభివృద్ధిని మంట కలిపి స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న అధికార వైసిపిని ఎదిరిస్తూ.. ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి జనసేన పార్టీని ఆదరించాలని గౌతమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క జనసైనికుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనంతరం టవర్ క్లాక్ అవరణంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్ర శేఖర్, వజ్రకరూరు అచనాల కేశవ, కుడెర్ నగేశ్, వెలుగుప్ప సుదీర్, కార్యక్రమాల కమిటీ సభ్యులు విజయ్, అజయ్, కమిటీ సభ్యులు రాజేశ్, అబ్దుల్, హరీష్ శంకర్, మల్లికార్జున, తిలక్, మని కుమార్, సోము, రవికుమార్ నాయక్, ఉమేష్, శ్యామ్, కుమార్, రమేష్, దేవనయక్, గోపి, సాయి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.