మంగళగిరి జనసేన కార్యాలయంలో వంగవీటికి వర్ధంతి నివాళులు

మంగళగిరి: వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన రంగా చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, ప్రజా సమస్యలపై ప్రాణాలు సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పోరాటం చేసి తన ప్రాణాలు కోల్పోయిన మహానీయుడు, ఇప్పటికి, ఎప్పటికి ప్రజల గుండెల్లో కొలువైన ఉన్న మహా నాయకుడికి నేడు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో 34వ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించడం జరిగిందని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రంగా గారి ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించి, రంగా గారి ఆశయాలను నెరవేర్చే దిశగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, ఎంటిఎంసీ కార్యదర్శులు ఉమామహేశ్వరరావు, కామేష్, సాంబ, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి కిషోర్, మంగళగిరి మండల కార్యదర్శి కట్ట కృష్ణ, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, యర్రబాలెం గ్రామ కమిటీ కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, పార్టీ నాయకులు నారాయణ, షేక్ నాగుల్, పెద్దినేని వేణు, వాసా గోపి, వాసా శంకర్, శివ, మహేష్, నాగరాజు, మధు, బేతపూడి దీపక్, చిల్లపల్లి యూత్ సభ్యులు సందీప్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.