ఎన్.కొత్తపల్లి గ్రామంలో జనంలోకి జనసేన

అమలాపురం, జనంలోకి జనసేన కార్యక్రమం సోమవారం ఉప్పలగుప్తం మండలం, గాడవిల్లి, ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి గ్రామాలలో నిర్వహించడం జరిగింది. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా అమలాపురం పార్లమెంట్ నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ స్థానిక సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ రానున్న రోజులలో అధికారంలోకి రాబోతుందని మీ యొక్క సమస్యలు తీరుతాయని మీరందరు జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, క్రియాశీలక నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు, వీర మహిళలు, అగ్నికుల క్షత్రియ నాయకులు మరియు జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.