జనసైనికుడు సూర్యకి జనసేన చేయూత

కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ పీఏసీ మెంబర్ డా. హరిప్రసాద్ పర్యవేక్షణలో నియోజకవర్గ నాయకుల సమక్షంలో మంగళవారం క్రియాశీలక సభ్యత్వం ద్వార వచ్చిన రూ 11564/- భీమా చెక్కును సూర్య కు మండల అధ్యక్షులు అమీర్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణు, మునెప్ప, గుడిపల్లి మండల అధ్యక్షులు అమీర్ నియోజకవర్గ నాయకులు హంసగిరి జాన్, గణేష్, భాస్కర్, మంజునాథ్, అరుణ్, బాలాజీ అమల, మణికంఠ, నాగరాజు, వెంకటేష్, మురుగ మరియు జనసైనికులు పాల్గొన్నారు.