మహా సంకల్ప యాత్ర 8వ రోజు

అమలాపురం, జనసేన పార్టీ “ఒక్క అవకాశం” మహా సంకల్ప యాత్ర 8వ రోజు అల్లవరం మండలం నాయకులు పోలిశెట్టి బాబులు ఆధ్వర్యంలో గుడాల గ్రామంలో మట్టపర్తి వారి పేట, జాంబవుల పేట, ములపర్తి వారి పేట, నిర్వహించారు ముందుగా టైలర్ డే సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న టైలర్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి, ఒక్క అవకాశం మహా సంకల్ప యాత్రను ప్రారంభించారు. ప్రతీంటికి అధ్యక్షుల వారి సిద్ధాంతాలను మనోగతాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రతీఇంటికి వివరిస్తూ 2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. గుడాల గ్రామంలో 2009లో ఇచ్చిన ఇళ్ళస్థలాల కాలనీలో ఇప్పటికీ కనీసం రోడ్డు, కరెంట్, మంచినీళ్ళు, డ్రైనేజీ లైను పూర్తి కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మీ గ్రామ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మీకు న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, నాయకులు కంచిపల్లి అబ్బులు, ఉండ్రు భగవాన్ దాస్, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, వాకపల్లి వెంకటేశ్వరావు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి కొప్పుల నాగమానస, బట్టు పండు, వీర మహిళ తిక్క సరస్వతి, నిమ్మకాయల రాజేష్, డి.ఎస్.ఎన్ కుమార్, యాళ్ళ సురేష్, కైరమ్ రాజా, నల్లా చిన్న, నల్లా దుర్గారావు, గొలకోటి చిన్న, ముస్లిం మైనారిటీ సభ్యులు కరిముళ్ళబాబా షరీఫ్ మరియు గుడాల జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.