ఐటి టీమ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు వాలంటీర్ల సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జనసేన పార్టీ ఐటీ విభాగం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పలచోళ్ళ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఐటి కో-ఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్ అధ్యక్షతన అమలాపురం నియోజకవర్గ జనసేన పర్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ముఖ్య అతిధిగా అమలాపురం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పాల్గొని మాట్లాడుతూ… ప్రతి క్రియాశీలక సభ్యుడు అస్త్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు వీక్షించే విధంగా చూడాలని, అదేవిధంగా ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ పలుచోళ్ళ వేణు, జిల్లా ఐటి కో-ఆర్డినేటర్ గాలిదేవర తమ్మేష్ కోరడం జరిగింది. అగ్నికుల క్షత్రియుల సమస్యలపై మంగళవారం 4వ తేదీ అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వందలాదిగా అగ్నికుల క్షత్రియులు జనసైనికులు జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియుల సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎంపీటీసీలు రాష్ట్ర, జిల్లా నాయకులు వీర మహిళలు, క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించిన పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు.