అగ్ని ప్రమాద బాధితునికి భరోసాగా జనసేన

విశాఖ దక్షిణ నియోజవర్గం: ఇటీవల 36వ వార్డులో స్థానికంగా నివసిస్తున్న మధుసూదనరావు అనూహ్యంగా అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు 36వ వార్డు నాయకులు జక్కా వాసుదేవరావుకి తెలియపర్చగా వెంటనే వారి బృదాం పద్మనాభం అనిల్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ మరియు నవీన్ కుమార్, 39వ వార్డు జనసేన రమేష్, సుదీర్, పద్మ వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాదం కోసం తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని మనోధైర్యం ఇవ్వడం జరిగింది.