బిసిల రుణం తీర్చుకోవాలని చింతమనేనిని కోరిన జనసేన

దెందులూరు నియోజకవర్గం: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఏలూరు జనసేన నాయకులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి చందు తాతపూడి స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ.. చింతమనేని దెందులూరు నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీచేస్తే వారిని నా బుజాలు పైన ఎక్కించుకొని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నేను గెలిపించుకుంటాను అని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో బిసి ఓటింగ్ 50 శాతం వున్నప్పటికీ ఇప్పటివరకు బిసిలు మీ పార్టీజెండా మోస్తూ.. మీకు రెండు సార్లు అధికారం ఇచ్చారు. అందుకని మీకు బిసిల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు దెందులురులో పవన్ కళ్యాణ్ గారికే కాదు జనసేన పార్టీ తరుపున గతంలో పోటీచేసిన మా బిసిల ఆడపడుచు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకట లక్ష్మి గారికీ సీటు ఇచ్చినా మద్దతు తెలియచేయాలని కోరుకుంటున్నామని చందు తెలిపారు.