శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో “ఓటు హక్కు” పై జనసేన అవగాహనా కార్యక్రమం

అనంతపురం, శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటి భగతసింగ్ స్టూడెంట్ యూనియన్ లా డిపార్ట్మెంట్ అద్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా “ఓటు హక్కు” పై అవగాహన కలిగిస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగతసింగ్ యూనియన్ నాయకుడు మరియు జనసేన నాయకులు హెన్రీ పాల్ మాట్లాడుతూ… భారతదేశ స్వతంత్ర సమరయోధులు యొక్క త్యాగానికి రాజ్యాంగం ఆర్టికల్ 326 తరుపున ప్రతి ఒక్క పౌరుడుకి ఓటు హక్కు కలిపించింది దీనిని ప్రతి ఒక్క పౌరుడు అవినీతితో కాకుండా… నీతి, నిజాయితీతో ఓటుని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో “లా” డిపార్ట్మెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు గిరప్ప, చైతన్య, అంజినమ్మ, సంధ్య తరితరులు పాల్గొన్నారు