కాకినాడ సిటీలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ, జనసేన భీమ్ యాత్ర జనసేన పార్టీ జగన్నాధపురంలోని సైంట్ యేన్స్ స్కూలు వెనక వైపు ఉన్న అంబేడ్కర్ విగ్రహం సమీప ప్రాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ మరియు డివిజన్ కమిటీ నాయకుల, సభ్యుల ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ మరియు పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక దళితులని చైతన్యపరుస్తూ మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ స్వరం వినపడినా పోలీసులతో వారి గొంతు నొక్కెస్తోందనీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుని కూడా హరిస్తోందన్నారు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చాకా అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు రూపాయలు అప్పుతెచ్చాడని ఇది పేదలు, దళితుల రక్తాన్ని పిండి చేసే వ్యాపారం కాదా అని ప్రశ్నించారు. ఈ వై.సి.పి ప్రభుత్వానికి మానవత్వమే లేదనీ దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పోరాడుతోందన్నారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, సుంకర సురేష్, బండి సుజాత, బట్టు లీల, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి, మిరియాల హైమావతి, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు.