రేచర్లపేటలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ, కాకినాడ సిటీ ఇన్చార్జ్ మరియు పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు 6వ డివిజన్ రేచర్లపేటలో కంటా రవిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన భీమ్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ ఈ వై.సి.పి ప్రభుత్వం అన్యాయాలపై ప్రజలను చైతన్యపరిచారు. వై.సి.పి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచి పాలన మొదలుపెట్టిన రోజు నుండీ నేటివరకు దళితులపై దౌర్జన్యం జరగని రోజే లేదని వివరించారు. వివిధ పధకాల ద్వారా బోలుడంత మొత్తాన్ని ఇస్తున్నామని చెపుతున్నారనీ, కానీ తమ సంపాదన పెంచుకుని సమాజంలో ఉన్నత స్థితికి వచ్చే స్వయం ఉపాధి మార్గాలని మూసేసారన్నారు, ఎందుకంటే వీళ్ళ మోచేతి నీళ్ళు తాగే బతకాలన్నది వీళ్ళ దురహంకారమనీ దీన్ని జనసేన-తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా ఖండిస్తున్నాయన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వ కుటిల రాజకీయాన్ని జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను సాగనీయమన్నారు. తదుపరి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, చిట్టి శేఖర్, పచ్చిపాల మధు, లోకేష్, సాయి, సుంకర సురేష్, దారపు సతీష్, మనోహర్లాల్ గుప్తా, సమీర్, ముత్యాల దుర్గాప్రసాద్, పెద్దిరెడ్డి ఉదయభాస్కర్, బోడపాటి మరియా, బండి సుజాత, సత్యవతి, దీప్తి, హైమవతి, రమణమ్మ, ఉమా తదితరులు పాల్గొన్నారు.