కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ గారి సూచనలమేరకు రైల్వే స్టేషన్ – నూకాలమ్మ గుడి ప్రాంతంలో జనసేన భీమ్ యాత్ర మనోహర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ప్రశ్నిస్తే కటకటాల పాలే ఈ రోజుల్లో అలా ఉంది ఈ వై.సి.పి ప్రభుత్వ పాలన అని అన్నారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి చూస్తే సాక్యాత్తు మీడియా సమక్షంలో రాష్ట్ర మంత్రి ఫొటోసెషన్లో నేలమీద కూర్చునే పరిస్థితి అని వీరికే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం లేదని నేడు సామాన్యులందరూ అనుకుంటున్నారని అన్నారు. మేధావుల మౌనం ఎంత ప్రమాదకరమో నేడు చవిచూస్తున్నామనీ ఇది సమాజ భవిష్యత్తుకి ఎంతమాత్రం వాంచనీయం కాదన్నారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్. షణ్ముక్, ఎం. నాగార్జున, జి. కిరణ్, బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, సబ్బే దీప్తి, బోడపాటి మరియ, చోడిపిల్లి సత్యవతి, బట్టు లీల, తనంచింతల రమ్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.